మనిక, సుతీర్థ ఓటమి

24 Apr, 2019 01:22 IST|Sakshi

బుడాపెస్ట్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌ షిప్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ మనికా బత్రా పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్‌ మనిక 2–11, 8–11, 11–7, 7–11, 9–11తో ప్రపంచ 24వ ర్యాంకర్‌ చెన్‌ జు యు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయింది. గత ఏడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం నెగ్గిన మనిక తొలి రౌండ్‌ మ్యాచ్‌లో 14–12, 11–5, 11–5, 11–8తో సెర్బియా క్రీడాకారిణి ఆండ్రియా టొడొరివిక్‌ను సునాయాసంగా ఓడించింది.

భారత క్వాలిఫయర్, ప్రపంచ 502వ ర్యాంకర్‌ సుతీర్థ ముఖర్జీ 8–11, 17–15, 11–9, 5–11, 6–11, 11–8, 11–6తో ప్రపంచ 58వ ర్యాంకర్‌ సబైన్‌ వింటర్‌ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. అయితే రెండో రౌండ్‌లో సుతీర్థ 11–4, 8–11, 11–7, 5–11, 3–11, 9–11తో అడ్రియానా దియాజ్‌ (ప్యూర్టోరికో) చేతిలో ఓడిపోయింది.  తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో అర్చన11–8, 11–8, 19–17, 8–11, 6–11, 7–11, 4–11తో దినా మెష్రెఫ్‌ (ఈజిప్ట్‌) చేతిలో, మధురికా 5–11, 11–9, 11–6, 8–11, 11–7, 13–11తో అమెలీ సొల్జా (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో సత్యన్‌–అర్చన ద్వయం 11–9, 11–4, 11–8, 11–13, 11–9తో అల్వారో–గాలియా ద్వొరాక్‌ (స్పెయిన్‌) జోడీపై గెలిచి ప్రి క్వార్టర్స్‌కు  చేరింది.  
 

మరిన్ని వార్తలు