స్విస్‌ ముందుకెళ్లింది..

29 Jun, 2018 04:00 IST|Sakshi

 2–2తో కోస్టారికాతో మ్యాచ్‌ డ్రా

నిజ్నీ నోవ్‌గొరడ్‌: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌ నాకౌట్‌కు చేరింది. గ్రూప్‌ ‘ఇ’లో గురువారం స్విట్జర్లాండ్, కోస్టారికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 2–2తో డ్రా అయింది. దీంతో ఈ గ్రూప్‌లో 5 పాయింట్లతో ఉన్న స్విస్, బ్రెజిల్‌ (7)తో పాటు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవని కోస్టారికా అట్టడుగుకు పడిపోయింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు చెమటోడ్చారు. స్విస్‌ తరఫున బ్లెరిమ్‌ జెమయిలి (31వ ని.), జోసిప్‌ డ్రిమిక్‌ (88వ ని.) గోల్‌ చేయగా, కోస్టారికా జట్టులో కెండల్‌ వాస్టన్‌ (56వ ని.) గోల్‌ సాధించాడు. మరో గోల్‌ను స్విట్జర్లాండ్‌ గోల్‌కీపర్‌ యాన్‌ సొమర్‌ ఇంజ్యూరీ టైమ్‌ (90+3వ ని.)లో సెల్ఫ్‌గోల్‌ చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు