'ఆ ఫార్మెట్ తో స్పిన్నర్ల సామర్థ్యం పెరిగింది'

18 Jun, 2015 19:27 IST|Sakshi
'ఆ ఫార్మెట్ తో స్పిన్నర్ల సామర్థ్యం పెరిగింది'

వెల్లింగ్టన్:  ట్వంటీ- 20 ఫార్మెట్ స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు పెరగటానికి కారణమైందా?, ఆ ఫార్మెట్ తో  స్పిన్నర్లు బ్యాట్స్ మెన్ ఆలోచనలకు చెక్ పెడుతున్నారా? అంటే అవుననే అంటున్నాడు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్  డానియల్ వెటోరి. స్పిన్నర్ల శక్తి సామర్థ్యాలు బాగా పెరగడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చాలా బాగా దోహదపడిందని తాజాగా స్పష్టం చేశాడు. బ్యాట్స్ మెన్ ఎదురుదాడిని స్పిన్నర్లు ముందే ఊహించడానికి ట్వంటీ 20 ఫార్మెట్ చక్కటి వేదికగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

 

ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కు కోచ్ గా ఉన్న వెటోరి..  ప్రస్తుతం  బిగ్ బాష్ లీగ్ లో బ్రిస్బేన్ హీట్ కు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఆద్యంతం బ్యాట్స్ మెన్  గేమ్ గా ఉండే ట్వంటీ 20 ఫార్మెట్ లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నాడు.  ట్వంటీ 20 ల్లో అనేక స్టేజ్ లలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నారన్నాడు. సాంప్రదాయ శైలిలో బౌలింగ్ చేసే స్పిన్నర్లు జాతీయ జట్టులో స్థానాలను దక్కించుకుంటున్నారని వెటోరి తెలిపాడు.

మరిన్ని వార్తలు