తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా

25 May, 2020 11:19 IST|Sakshi

ఇంకా టైమ్‌ ఉంది కదా.. ఇప్పుడే నిర్ణయం వద్దు

వరల్డ్‌కప్‌పై ప్రతీ ఒక్కరికీ ఆసక్తి ఉంది

కరాచీ: ఈ ఏడాది అక్టోబర్‌–నవంబర్‌లలో ఆస్ట్రేలియాలో టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీ జరిగే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దీనిపై ఇప్పటివరకూ ఎటువంటి స్పష్టత లేకపోయినా వాయిదా తప్పదని ఆలోచనలో చాలా క్రికెట్‌ బోర్డులు ఉన్నాయి. దీనిపై ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ అభిప్రాయపడగా, అప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ మిస్బావుల్‌ హక్‌ కోరుతున్నాడు. (టి20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకోండి)

ఈ మెగా టోర్నీపై తొందరపడి నిర్ణయం తీసుకుని వాయిదా వేసేకంటే మరికొంత కాలం వేచి చూస్తేనే బెటర్‌ అని పేర్కొన్నాడు. ఒకసారి క్రికెట్‌ యాక్టివిటీలు ఆరంభమైతే టీ20 వరల్డ్‌కప్‌ కంటే అత్యుత్తమ టోర్నీ ఏదీ ఉండదన్నాడు. దాంతో టోర్నీ వాయిదా నిర్ణయాన్ని అ‍ప్పుడే తీసుకోవద్దని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశాడు. ‘ టీ20 వరల్డ్‌కప్‌ను నిర్ణీత షెడ్యూల్‌లో నిర్వహించే మార్గం దొరుకుతుందనే ఆశిస్తున్నా. వరల్డ్‌కప్‌ అంటే దాని కుండే క్రేజే వేను. ప్రతీ ఒక్కరూ వరల్డ్‌కప్‌ను చూడాలనుకుంటారు. వరల్డ్‌కప్‌ అనేది క్రికెట్‌లో హైలైట్‌ టోర్నీ. ఇంకా వరల్డ్‌కప్‌కు చాలా సమయం ఉంది కాబట్టి అప్పటికి పరిస్థితులు చక్కబడతాయనే ఆశిద్దాం. ఇంకా ఒక నెల, ఆపై సమయంలోనే నిర్ణయం తీసుకోవడమే ఉత్తమం’ అని మిస్బావుల్‌ హక్‌ పేర్కొన్నాడు. (భారత హాకీ దిగ్గజం బల్బీర్‌ కన్నుమూత)

మరిన్ని వార్తలు