షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణం

25 Aug, 2018 20:56 IST|Sakshi
తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌

జకార్త : ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం వరించింది. పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ పసిడిని సొంతంచేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోటీలో తజిందర్‌పాల్‌ గుండును 20.75 మీటర్లు విసిరి ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. తద్వారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్‌ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. మూడో సారి విఫలమయ్యాడు.

నాలుగోసారి 19.96, ఐదోసారి 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. చైనా ఆటగాడు లియూ యంగ్‌ 19.52 మీటర్లతో రజతం, కజకిస్థాన్‌ అథ్లెట్‌ ఇవనోవ్‌ ఇవాన్‌ 19.40తో కాంస్యం అందుకున్నారు. ఏషియన్‌ గేమ్స్‌ చరిత్రలో పురుషుల షాట్‌పుట్‌ విభాగంలో భారత్‌కు ఇది 8వ మెడల్‌. 

మరిన్ని వార్తలు