12 పరుగులకే ఆరు వికెట్లు..

24 Sep, 2019 11:57 IST|Sakshi

పెర్త్‌: ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌లో భాగంగా ద మార్ష్‌ కప్‌ వన్డేల్లో టోర్నీలో విక్టోరియా జట్టు పరుగు తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. సోమవారం తస్మానియాతో జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విక్టోరియా బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు ఓటమి అంచుల వరకూ వెళ్లి చిరస్మరణీయమైన గెలుపును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విక్టోరియా జట్టు 47.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. సదర్లాండ్‌(53) హాఫ్‌ సెంచరీ సాధించగా, గ్లెన్‌ మ్యాక్స్‌ వెల్‌(34) ఫర్వాలేదనిపించాడు. ఇక మాథ్యూ షాట్‌(27) సమయోచితంగా ఆడటంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది.

అయితే 186 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన తస్మానియా లక్ష్యానికి చేరువగా వచ్చి ఓటమి పాలైంది. 12 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోవడంతో తస్మానియాకు పరాజయం తప్పలేదు. 172 పరుగుల వరకూ నాలుగు వికెట్లు మాత్రమే  కోల్పోయిన తస్మానియా.. ఆపై మరో 12 పరుగులు మాత్రమే జోడించి మిగతా వికెట్లను కోల్పోయింది. బెన్‌ మెక్‌డెర్మాట్‌(78) ఒక్కడే మెరిశాడు. విక్టోరియా బౌలర్లలో ట్రెమైన్‌,కోలీమ్యాన్‌లు తలో  నాలుగు వికెట్లతో చెలరేగి పోవడంతో తస్మానియా వరుసగా వికెట్లను  చేజార్చుకుని ఓటమి చెందింది. ఐదు పరుగులు సాధిస్తే విజయం దక్కించుకునే సమయంలో ఐదు వికెట్లను తస్మానియా చేజార్చుకోవడం ఇక్కడ మరో అంశం.


 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా