న్యూజిలాండ్‌ 203/5

15 Aug, 2019 10:04 IST|Sakshi

గాలే: శ్రీలంక స్పిన్నర్‌ అఖిల ధనంజయ (5/57) న్యూజిలాండ్‌ ను తిప్పేశాడు. తొలిటెస్టు తొలిరోజు ఆట పూర్తిగా సాగకపోయినా... సగం వికెట్లను పడగొట్టేశాడు. వర్షం ఆఖరి సెషన్‌ను దాదాపు తుడిచి పెట్టింది. రాస్‌ టేలర్‌ (86 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) నిలువడంతో... బుధవారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. టేలర్‌కు జతగా సాన్‌ట్నర్‌ (8 బ్యాటింగ్‌) క్రీజులో నిలిచాడు.

>
మరిన్ని వార్తలు