విలియమ్సన్, టేలర్ సెంచరీలు

8 Aug, 2016 02:48 IST|Sakshi
విలియమ్సన్, టేలర్ సెంచరీలు

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (151 బంతుల్లో 113; 10 ఫోర్లు)తో పాటు రాస్ టేలర్ (173 బంతుల్లో 124 నాటౌట్; 10 ఫోర్లు) శతకాలతో రెచ్చిపోయారు. దీంతో ఆదివారం రెండో రోజు తమ తొలి ఇన్నింగ్స్‌ను కివీస్ 150 ఓవర్లలో 582/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులతో రోజును ముగించింది.

>
మరిన్ని వార్తలు