19 ఏళ్ల తర్వాత టీమిండియా..

13 Dec, 2017 16:06 IST|Sakshi

భారత్‌-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్‌ శర్మ (208 నాటౌట్) డబుల్‌ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్‌ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తొలి వన్డేలో దారుణంగా విఫలమై చెత్త రికార్డును మూటగట్టుకున్న టీం ఇండియా మొహాలీలో భారీ లక్ష్యంతో లంకకు సవాల్‌ విసిరింది. మరో వైపు 115 బంతుల్లో రోహిత్‌ శర్మ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్‌లో 16 వ సెంచరీ పూర్తిచేసుకోగా.. వన్డేల్లో మూడో డబుల్‌ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు.

ఇదిలా ఉండగా టీమిండియా మొహాలీ వన్డేలో మరో రికార్డును సమం చేసింది. ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన రికార్డును భారత్‌ సమం చేసింది.1998లో సచిన్‌ చేసిన సెంచరీతో క్యాలెండర్‌ ఇయర్‌లో 18 వన్డే సెంచరీలను భారత్‌ నమోదు చేసింది. అయితే 2017 క్యాలెండర్‌ ఇయర్‌లో ఇప్పటి వరకు టీమిండియా 17 వన్డే సెంచరీలను చేసింది. తాజాగా మొహాలీలో జరుగుతున్న వన్డేలో రోహిత్‌ 115 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో 19 ఏళ్ల తర్వాత ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో టీమిండియా 18 వన్డే సెంచరీలు చేసి గత రికార్డును సమం చేసింది. 

మరిన్ని వార్తలు