475 పరుగులకు టీమిండియా ఆలౌట్

9 Jan, 2015 14:19 IST|Sakshi
475 పరుగులకు టీమిండియా ఆలౌట్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 475 పరుగులకు ఆలౌటయ్యింది. ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా మరో 133 పరుగులు మాత్రమే జోడించింది. హాఫ్ సెంచరీతో  ఆకట్టుకున్న అశ్విన్ (50)  పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. 110 బంతులను ఎదుర్కొన్న అశ్విన్ 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 

 

శుక్రవారం నాల్గో రోజు ఆటలో విరాట్ కోహ్లీ(147),  సాహా (30)లు నిష్ర్కమించిన అనంతరం అశ్విన్, భువనేశ్వర్ కుమార్ ల జోడి క్రీజ్ లో ఎక్కువ సేపు నిలబడటానికే ప్రాధాన్యత ఇచ్చింది. అనవసరపు షాట్లకు పోకుండా వీరిద్దరి జోడి ఆచితూచి ఆడింది. 112 బంతులను ఎదుర్కొన్న ఈ జోడి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఉమేశ్ యాదవ్ (4) పరుగులు చేసి చివరి వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరగా, మహ్మద్ షమీ(16) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  ఆసీస్ బౌలర్లలో స్టార్క్ కు మూడు వికెట్లు లభించగా, హారిస్ , లయన్ , వాట్సన్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.

మరిన్ని వార్తలు