పంత్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు..!

3 Jul, 2019 18:00 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా యువ సంచలనం రిషభ్‌ పంత్‌పై ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఔట్‌ఫీల్డ్‌లో పంత్‌ మరింత వేగంగా కదలాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతని ఫీల్డింగ్‌ లోపాలు బయటపడ్డాయని అన్నాడు. ఔట్‌పీల్డ్‌లో అతనికున్న వేగం సరిపోదని మరింత రాటుదేలాలని అన్నాడు. బంగ్లాతో మ్యాచ్‌ అనంతరం జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఫీల్డింగ్‌లో పంత్‌ మరింత శ్రమించాల్సి ఉంది. ముఖ్యంగా ఔట్‌ఫీల్డ్‌లో వేగంగా కదలడం.. మరీ ముఖ్యంగా బంతిని త్రో చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పంత్‌ను తగిన పొజిషన్‌లో ఫీల్డింగ్‌ చేయించాలని కెప్టెన్‌ కోహ్లి, ఎంస్ ధోని ఆసక్తితో ఉన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అతను 5 పరుగుల వరకు సేవ్‌ చేశాడు. ఒక క్యాచ్‌ కూడా అందుకున్నాడు. అయితే, టీమ్‌ అంచనాలకు తగ్గట్టుగా అతను ఫీల్డింగ్‌లో మెళకువలు నేర్చుకోవాలి.‌’అన్నాడు. 
(చదవండి : ‘పంత్‌ను అందుకే అలా పిలుస్తా’)

ఇక బంగ్లాతో మ్యాచ్‌లో ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన దినేష్‌ కార్తీక్‌ ఔట్‌ఫీల్డ్‌లో పంత్‌ కంటే బెటర్‌గా ఫీల్డింగ్‌ చేయగలడని అన్నాడు. ఎవరికి వారు తమ స్థానాల్లో మెరుగ్గా ఫీల్డింగ్‌ చేస్తే.. ఆయా చోట్ల వారినే కంటిన్యూ చేయడం జట్టుకు మేలు చేస్తుందని అన్నాడు. క్రికెట్‌ మైదానాలన్నీ ఒకే రీతిలో ఉండవనీ, టెక్నిక్‌తో ఫీల్డింగ్‌ చేసినప్పుడే అంచనాలు అందుకోగలమని చెప్పాడు. ఇక మంగళవారం బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో 28 పరుగులతో విజయం సాధించిన టీమిండియా సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.
(చదవండి : దినేశ్‌ కార్తీక్‌ ఎన్నాళ్లకెన్నాళ్లకు..)

మరిన్ని వార్తలు