భారీ ఆధిక్యం దిశగా విరాట్ సేన

5 Dec, 2015 14:47 IST|Sakshi
భారీ ఆధిక్యం దిశగా విరాట్ సేన

ఢిల్లీ:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా శనివారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ సేన టీ విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దీంతో టీమిండియా 329  పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రోజు ఆటలో  ఎనిమిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా.. ఆ తరువాత తేరుకుంది. శిఖర్-పూజారాల జోడి కుదురుగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా నిలదొక్కుకుంది. కాగా, 45 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన ఈ జోడి లంచ్ తరువాత నాలుగు పరుగుల వ్యవధిలో నిష్క్రమించడంతో టీమిండియా శిబిరంలో ఆందోళన నెలకొంది.

 

అయితే అటు తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లి(39 బ్యాటింగ్), అజింక్యా రహానే(22 బ్యాటింగ్) సఫారీల బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు కదిలించడంతో  టీమిండియా కుదురుకుంది. అంతకుముందు మురళీ విజయ్(3), రోహిత్ శర్మ(0), శిఖర్ ధవన్(21), చటేశ్వర పూజారా(28) పెవిలియన్ కు చేరారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 334 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 121 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు