నిలకడగా టీమిండియా బ్యాటింగ్

18 Oct, 2015 19:05 IST|Sakshi

రాజ్ కోట్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో  టీమిండియా నిలకడగా ఆడుతోంది. 18 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(45) కోహ్లి(22)లు క్రీజ్ లో ఉన్నారు. శిఖర్ ధవన్ (13) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దక్షిణాఫ్రికా విసిరిన 271 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా నెమ్మదిగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది.

 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది.  డీ కాక్ (103 ; 118 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) ,  డు ప్లెసిస్(60; 63 బంతుల్లో 6 ఫోర్లు) , బెహర్దియన్ (33 నాటౌట్) రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు చేసింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా