లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 105/2

13 Dec, 2014 07:56 IST|Sakshi
లంచ్ విరామ సమయానికి భారత్ స్కోరు 105/2

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు రసకందాయంలో పడింది. రెండో ఇన్నింగ్స్ను 290/5 వద్ద డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ ముందు 364 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో తొలి వికెట్ను 16 పరుగులకే కోల్పోయిన టీమిండియా, రెండో వికెట్ను మాత్రం 57 పరుగుల వరకు కాపాడుకుంది. లంచ్ విరామ సమయానికి 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. విజయం సాధించాలంటే మరో 259 పరుగులు అవసరం.

ఓపెనర్ శిఖర్ ధవన్ 8 బంతుల్లో ఒక ఫోర్ కొట్టి 9 పరుగులు చేసి, జాన్సన్ బౌలింగ్లో వికెట్ల వెనక దొరికిపోయాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం 121 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 47 పరుగులు చేసి క్రీజును అంటిపెట్టుకుని ఉన్నాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా 38 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేసి లియన్ బౌలింగులో వికెట్ కీపర్ హాడిన్కు క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 37 బంతుల్లో 3 ఫోర్లతో చకచకా 25 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. విజయమో.. వీరస్వర్గమో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత బ్యాట్స్మన్ ఉన్నారు.

మరిన్ని వార్తలు