మరో టైటిల్ దక్కేనా?

15 Jan, 2015 19:45 IST|Sakshi
మరో టైటిల్ దక్కేనా?
పోర్ట్ ఆఫ్ స్పెయిన్:ప్రస్తుతం వన్డేల్లో, టెస్టుల్లో నంబర్ స్థానంలో ఉన్న భారత్ ముక్కోణపు టోర్నీలో చివరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో మాత్రమే ఆడిన ధోని.. తిరిగి తుది సమరానికి సిద్ధమైయ్యాడు. చాంపియన్స్ ట్రోఫీని సులువుగానే చేజిక్కించుకున్న భారత్‌కు ఈ సిరీస్‌లో కష్టపడక తప్పలేదు. రెండు మ్యాచ్‌ల్లో ఓటమి, మరో రెండు మ్యాచ్‌ల్లో గెలుపుతో ఫైనల్‌కు చేరి భారత అభిమానుల ఆశల్ని నిజం చేశారు. నాలుగు రోజుల క్రితం పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ధోని తుది మ్యాచ్‌లో ఆడటం భారత్‌కు కలిసొచ్చే అంశం.
 
 గత ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోర ఓటమి చూసిన భారత్.. విజయాల బాట పట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ విజయాలు ఏ ఒక్కడి ద్వారానో వచ్చినవి కావు. ఈ విజయాల్లో టీంఇండియా సమిష్టి కృషి చాలానే ఉన్నా, జట్టును ముందుండి నడిపించడంలో ధోని విజయవంతమైయ్యాడు. గతంలో ఎన్నడూ లేనంతగా బౌలింగ్ విభాగంలో భారత్ బలపడినందే చెప్పాలి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల రూపంలో ఇద్దరు మెరికల్లాంటి కుర్రాళ్లు టీం ఇండియాకు దొరికారు. 
 
ముఖ్యంగా ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్‌ల గురించి మాత్రం ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒకరు తనదైన ఎటాకింగ్‌తో ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తుంటే, భువనేశ్వర్ తన స్వింగ్ మాయాజాలంతో అవతలి టాప్ ఆర్డర్‌ను కట్టడి చేస్తున్నాడు. బౌలింగ్ విభాగం బాగుంటేనే విజయాలు ఎక్కువ సాధించేందుకు ఆస్కారం ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం. గత నెలలో చాంపియన్స్ ట్రోఫీని భారత్ సులువుగా గెలుచుకోవడంలో కూడా బౌలింగ్ విభాగమే బాగా దోహదపడిందనేది ఎవరూ కాదనలేని సత్యం.
 
 టీం ఇండియా.. ముక్కోణపు టోర్నీలో బలమైన జట్టుగా బరిలోకి దిగింది. కొన్ని ఒడిదుడుకులు, అపజయాల మధ్య టోర్నీ ఫైనల్‌కు చేరి ఆతిథ్య జట్టను వెస్టిండీస్‌ను సాగనంపింది. చివరి మ్యాచ్‌ల్లో సంచలనాలు నమోదు చేయడం భారత్‌కు పరిపాటే. ఊహించకుండానే ఫైనల్‌కు చేరిన భారత జట్టు మరో టైటిల్‌ను గెలుస్తుందని ఆశిద్దాం.
 
మరిన్ని వార్తలు