భారత్‌తో టీ20: వర్షంతో నిలిచిన ఆట

21 Nov, 2018 13:23 IST|Sakshi

బ్రిస్బేన్‌: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య తొలి పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ప్రత్యర్థి జట్టును మొదట బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందుగా ప్రకటించిన 12 మంది సభ్యుల నుంచి మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తప్పించింది. చైన్‌మెన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌వైపే కోహ్లి మొగ్గు చూపాడు.

విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్, కేఎల్‌ రాహుల్, దినేశ్‌ కార్తీక్, వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌లతో బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. అటు ఆసీస్‌ కూడా ఈ మ్యాచ్‌లో శక్తిమేర పోరాడాలని ఆరాటపడుతోంది. ఇక ఆసీస్‌ ముందుగా స్పిన్నర్‌ లేకుండానే బరిలోకి దిగాలని భావించినా.. చివరకు లెగ్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాతో బరిలోకి దిగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి పది టీ20 పోరాటాల్లో టీమిండియా ఎనిమిదింట గెలవగా, ఆసీస్‌ కేవలం రెండు మాత్రమే గెలిచింది.  

  • 75 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. కుల్దీప్‌ బౌలింగ్‌లో క్రిస్‌లిన్‌ (37) రిటర్న్‌ క్యాచ్‌ ఔట్‌
  • 64 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. కుల్దీప్‌ బౌలింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌(27) క్యాచ్‌ ఔట్‌
  • 24 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌.. ఖలీల్‌ బౌలింగ్‌లో షార్ట్‌ (7) క్యాచ్‌ ఔట్‌
  • 16.1 ఓవర్లలో 153 స్కోరు వద్ద వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది

తుది జట్లు
టీమిండియా: రోహిత్‌ శర్మ, ధావన్, కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్, కృనాల్‌ పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, ఖలీల్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), షార్ట్, లిన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, మెక్‌డెర్మట్, క్యారీ, ఆడం జంపా, ఆండ్రూ టై, బెహ్రెన్‌డార్ఫ్, స్టాన్‌లేక్‌. 

మరిన్ని వార్తలు