షాట్‌పుట్‌లో తజీందర్‌కు నిరాశ

4 Oct, 2019 02:31 IST|Sakshi

దోహా: ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో మరో భారత స్టార్‌ నిరాశపరిచాడు. పురుషుల షాట్‌పుట్‌ ఈవెంట్‌లో భారత స్టార్, ప్రస్తుత ఆసియా చాంపియన్, ఆసియా క్రీడల చాంపియన్‌ తజీందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌ ఫైనల్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యాడు. గురువారం జరిగిన క్వాలిఫయింగ్‌లో గ్రూప్‌ ‘బి’లో పోటీపడిన తజీందర్‌ ఇనుప గుండును 20.43 మీటర్ల దూరం విసిరి తన గ్రూప్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో, గతేడాది ఆసియా క్రీడల్లో తజీందర్‌ షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. అయితే అదే ప్రదర్శనను ఇక్కడ పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు. గ్రూప్‌ ‘ఎ’లో 16 మంది... గ్రూప్‌ ‘బి’లో 18 మంది క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. టాప్‌–12లో నిలిచిన వారు శనివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధించారు. ఓవరాల్‌గా తజీందర్‌ 18వ స్థానంలో నిలిచాడు. గ్రూప్‌ ‘ఎ’ నుంచి ఎనిమిది మంది... గ్రూప్‌ ‘బి’ నుంచి నలుగురు ఫైనల్‌కు చేరారు. 20.90 మీటర్లను ఫైనల్‌కు చేరే కనీస అర్హత ప్రమాణంగా నిర్ణయించారు.

ముగిసిన బ్రిటన్‌ నిరీక్షణ
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌íÙప్‌లో బ్రిటన్‌ స్ప్రింట్‌ (100 లేదా 200 మీటర్లు) విభాగంలో నిరీక్షణ ముగిసింది. 36 ఏళ్ల విరామం తర్వాత బ్రిటన్‌కు 200 మీటర్ల విభాగంలో ఈ మెగా ఈవెంట్‌లో తొలి పసిడి పతకం లభించింది. మహిళల 200 మీటర్ల విభాగంలో దీనా యాషెర్‌ స్మిత్‌ విజేతగా నిలిచి బ్రిటన్‌ ఖాతాలో స్వర్ణాన్ని చేర్చింది. ఆమె 21.88 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచింది. బ్రిట్నీ బ్రౌన్‌ (అమెరికా–22.22 సెకన్లు) రజతం, ముజింగా కామ్‌బుండ్‌జి (స్విట్జర్లాండ్‌–22.51 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. ‘ఏం చెప్పాలో తెలియడంలేదు. ఈ విజయాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. స్ప్రింట్‌ స్వర్ణం కోసం కల కన్నాను. ఇప్పటికి ఇది నిజమైంది’ అని 23 ఏళ్ల దీనా వ్యాఖ్యానించింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా