ఆసియా బాక్సింగ్‌ పోటీలకు నిఖత్‌

16 Apr, 2019 15:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఆసియా మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటుకునేందుకు తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ సిద్ధమైంది. ఈనెల 17 నుంచి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు పది మంది సభ్యులుగల భారత మహిళల బృందం సోమవారం ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లింది. ఈ ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఆసియా చాంపియన్‌షిప్‌ను సన్నాహకంగా భారత బాక్సర్లు భావిస్తున్నారు. 2001లో మొదలైన ఆసియా మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీ చరిత్రలో భారత మహిళా బాక్సర్లు 19 స్వర్ణాలు, 21 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 60 పతకాలను సాధించారు.

భారత మహిళల బాక్సింగ్‌ జట్టు: నీతూ (48 కేజీలు), నిఖత్‌ జరీన్‌ (51 కేజీలు), మనీషా (54 కేజీలు), సోనియా చహల్‌ (57 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్‌ (69 కేజీలు), నుపుర్‌ (75 కేజీలు), పూజా రాణి (81 కేజీలు), సీమా పూనియా (ప్లస్‌ 81 కేజీలు).

మరిన్ని వార్తలు