సెమీస్‌లో తెలంగాణ

1 Mar, 2018 10:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అంతర్రాష్ట్ర టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ మహిళల జట్టు సెమీస్‌కు చేరింది. బుధవారం జరిగిన మహిళల టీమ్‌ ఈవెంట్‌ క్వార్టర్స్‌లో తెలంగాణ 2–1తో మధ్యప్రదేశ్‌ జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో శ్రావ్య శివాని (తెలంగాణ) 6–1, 6–2తో అనీషా గణేశ్‌పై గెలుపొంది జట్టుకు 1–0తో ఆధిక్యాన్ని అందించింది.

రెండో సింగిల్స్‌లో మౌళిక రామ్‌ (తెలంగాణ) 6–0తో ఆధిక్యంలో ఉన్న దశలో మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో సారా యాదవ్‌ (మధ్యప్రదేశ్‌) ముందంజ వేసింది. దీంతో స్కోరు 1–1తో సమమైంది. నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రావ్య శివాని– జనగాం సింధు (తెలంగాణ) జంట 6–2, 1–6, 10–4తో ‘సూపర్‌ టైబ్రేక్‌’ల సారాయాదవ్‌–అనీషా (మధ్యప్రదేశ్‌)పై నెగ్గడంతో తెలంగాణ సెమీస్‌కు చేరింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు