అశోక్‌ అద్వైత్‌కు రజతం

26 Mar, 2019 15:35 IST|Sakshi

స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ సమ్మర్‌ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ స్విమ్మర్‌ కౌషిక అశోక్‌ అద్వైత్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో అద్వైత్‌ దేశానికి పతకాన్ని అందించాడు. స్విమ్మింగ్‌లో పోటీపడిన అద్వైత్‌ బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో రాణించి రజత పతకాన్ని సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో జాతీయ జట్టుకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్‌ అద్వైత్‌ మాత్రమే. ఢిల్లీ వేదికగా జరిగిన అర్హత పోటీల్లో సత్తా చాటిన అద్వైత్‌ వరల్డ్‌ సమ్మర్‌ ఒలింపిక్స్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికయ్యాడు.

ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించేందు కు అద్వైత్‌ 2016 నుంచి గచ్చిబౌలిలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌ ఆయుశ్‌ యాదవ్‌ వద్ద ప్రత్యేక శిక్షణ పొందు తున్నాడు. స్విమ్మింగ్‌లోనే కాకుండా చదువుల్లో నూ రాణిస్తోన్న అతను అరోరా కాలేజీలో డిగ్రీ (బ్యాచ్‌లర్‌ ఇన్‌ టూరిజం స్టడీస్‌ మేనేజ్‌మెంట్‌) చదువుతున్నాడు. ఈనెల 14 నుంచి 21 వరకు అబుదాబిలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌ మొత్తం 21 పతకాలను సాధించింది. అందులో 9 స్వర్ణాలు, 6 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అద్వైత్‌ కఠిన శిక్షణ పొందాడని కోచ్‌ ఆయుశ్‌ తెలిపారు. ప్రతిరోజు 5 గంటల పాటు స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు