తెలంగాణ జట్టుకు టైటిల్‌

27 Jan, 2019 10:11 IST|Sakshi

జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌ గేమ్స్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రికెట్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు సత్తా చాటింది. చెన్నై వేదికగా జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన తమిళనాడు నిర్ణీత 10 ఓవర్లలో 89 పరుగులు చేసింది. అరవింద్‌ (53) అర్ధసెంచరీతో జట్టుకు మంచి స్కోరును అందించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో శశాంక్‌ యాదవ్, పరిమళ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌లో మురళీ (42) రాణించడంతో తెలంగాణ 4 వికెట్లు కోల్పోయి 95 పరుగులు చేసి గెలిచింది. ప్రత్యర్థి బౌలర్లలో సుదర్శన్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు.  

మరిన్ని వార్తలు