తెలంగాణ లిఫ్టర్లకు 4 పతకాలు

18 Dec, 2017 10:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆకట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో స్వర్ణం, రజతం, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 4 పతకాలను సాధించింది. బాలుర 69 కేజీల విభాగంలో ఆర్‌ఎస్‌ఎల్‌ సాయి (తెలంగాణ) చాంపియన్‌గా నిలిచాడు. అతను ఫైనల్లో 235 కేజీలు (102 స్నాచ్‌+133 క్లీన్‌ అండ్‌ జర్క్‌) బరువునెత్తి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు.

62 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బి. కృష్ణ (222 కేజీలు) రజతాన్ని, ఏవీ యశ్వంత్‌ (తెలంగాణ, 205 కేజీలు) కాంస్యాన్ని సాధించారు. 77 కేజీల విభాగంలో ఎంహెచ్‌ నిహాల్‌ రాజ్‌ (తెలంగాణ, 256 కేజీలు), ఎ.శివరామకృష్ణ (ఆంధ్రప్రదేశ్, 254 కేజీలు) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించగా... బాలికల 63 కేజీల విభాగంలో వేముల సాహితి (123 కేజీలు) కాంస్యాన్ని దక్కించుకుంది.  

 

మరిన్ని వార్తలు