టైటిల్‌ పోరుకు సంజన

25 May, 2019 09:57 IST|Sakshi

జాతీయ అండర్‌–16 టెన్నిస్‌ టోర్నీ

ముంబై: రమేశ్‌ దేశాయ్‌ స్మారక జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నం.1 ప్లేయర్, హైదరాబాదీ సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా వేదికగా స్థాయిలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్‌లో సంజన సింగిల్స్‌ విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది.

శుక్రవారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ సంజన (తెలంగాణ) 6–1, 6–1తో ఎనిమిదో సీడ్‌ పరీ సింగ్‌ (హరియాణా)పై గెలుపొందింది. రెండో సెమీస్‌లో ఏడో సీడ్‌ రెనీ సింగ్లా 6–0, 6–2తో అన్‌సీడెడ్‌ నైషా శ్రీవాస్తవ్‌ను ఓడించి సంజనతో ఫైనల్‌ పోరుకు సిద్ధమైంది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు