టీ20లో థాయ్‌లాండ్‌ సరికొత్త రికార్డు

11 Aug, 2019 14:52 IST|Sakshi

అమెస్టర్‌డామ్‌: అంతర్జాతీయ టీ20ల్లో మరో కొత్త రికార్డు లిఖించబడింది.  థాయ్‌లాండ్‌ మహిళల క్రికెట్‌ జట్టు వరుసగా 17వ టీ20 విజయాన్ని నమోదు చేసి నూతన అధ్యాయాన్ని లిఖించింది. క్వాడ్రాంగులర్‌ సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ ఘన విజయం సాధించడం ద్వారా ఈ ఫీట్‌ను నమోదు చేసింది. తొలుత ఆతిథ్య నెదర్లాండ్స్‌ను 54 పరుగులకే కూల్చిన థాయ్‌లాండ్‌ మహిళలు.. టార్గెట్‌ను ఎనిమిది ఓవర్లలో ఛేదించారు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 17వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటివరకూ ఆసీస్‌ మహిళల పేరిట ఉన్న 16 విజయాల రికార్డును థాయ్‌లాండ్‌ మహిళలు బ్రేక్‌ చేశారు. 2018 జూలైలో తన టీ20 జైత్రయాత్రను ఆరంభించిన థాయ్‌లాండ్‌.. ఇప్పటివరకూ ఓటమి లేకుండా దూసుకుపోతోంది. ఈ జాబితాలో థాయ్‌లాండ్‌, ఆసీస్‌ల తర్వాత స్థానంలో ఇంగ్లండ్ ‌(14 వరుస విజయాలు) ఉంది. పురుషుల క్రికెట్‌లో అఫ్గానిస్తాన్‌ 11 వరుస విజయాలతో టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుండగా, పాకిస్తాన్‌ 9 విజయాలతో రెండో స్థానంలో ఉంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ టీమ్‌ సీఎస్‌కే: మూడీ

‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’

నిధుల సేకరణకు దిగ్గజ క్రికెటర్లు

షాట్‌ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!

కోహ్లిని వద్దన్న ధోని..!

సినిమా

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్