సౌత్‌జోన్‌ శిబిరాల ముగింపు

27 May, 2017 10:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ సౌత్‌జోన్‌లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణా శిబిరాలు శుక్రవారంతో ముగిశాయి. దాదాపు 3,000 మంది బాలబాలికలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మార్చ్‌పాస్ట్‌లో చందూలాల్‌ బారాదరికి చెందిన సాలార్‌–ఇ–సలావుద్దీన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఉత్తమ ప్రదర్శనతో తొలి స్థానంలో నిలిచింది.

దారుల్‌షిఫా ప్లేగ్రౌండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు రెండో స్థానంలో, ఖిల్వత్‌ ప్లేగ్రౌండ్‌ బాక్సింగ్‌ జట్టు మూడో స్థానంలో నిలిచాయి. చార్మినార్‌ ఎంఎల్‌ఏ అహ్మద్‌ పాషా ఖాద్రీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జీహెచ్‌ఎంసీ భవిష్యత్తులో మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేసి ఆటలను... ముఖ్యంగా ఫుట్‌బాల్‌ను అభివృద్ధి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో పత్తర్‌ఘట్టి డివిజన్‌ కార్పొరేటర్‌ సయ్యద్‌ సోహైల్‌ ఖాద్రీ, దూద్‌బౌలి డివిజన్‌ కార్పొరేటర్‌ ఎంఏ గఫార్, సౌత్‌జోన్‌ సర్కిల్‌ 4బి డిప్యూటీ కమిషనర్‌ విజయ భాస్కర్, సర్కిల్‌ 6 డిప్యూటీ కమిషనర్‌ దశరథ్, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, సౌత్‌జోన్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు