తప్పంతా జైషా కోచ్‌దే

22 Oct, 2016 04:44 IST|Sakshi
తప్పంతా జైషా కోచ్‌దే

విచారణలో తేల్చిన కేంద్ర క్రీడాశాఖ 

 
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌లో భారత మారథాన్ రన్నర్, మహిళా అథ్లెట్ జైషా అస్వస్థతకు ఆమె కోచ్ నికొలాయ్ స్నేసరెవే కారణమని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ తమ విచారణలో తేల్చింది. పోటీ జరిగే రోజు మంచినీరు, శక్తినిచ్చే పానీయాలు సరఫరా చేయకపోవడానికి ఆమె కోచ్ ఇచ్చిన తప్పుడు మార్గదర్శకత్వమే కారణమని వెల్లడించింది. పోటీకి ముందు రోజు నీరు తదితర సదుపాయాల కల్పన కోసం ఆమె కోచ్ నికొలాయ్‌ను సంప్రదించగా ఆయన... అవేమీ అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రతినిధులకు చెప్పారు.


దీంతో మంచినీరు, శక్తి పానీయాలను వారు అందుబాటులో ఉంచలేకపోయారు. ఒలింపిక్స్‌లో ఆమె మారథాన్‌లో పరుగు పెట్టింది. అరుుతే సుదీర్ఘ పరుగు పోటీని పూర్తి చేసే క్రమంలో కనీసం మంచినీరైన తాగకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఐఓఏపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా, క్రీడాశాఖ విచారణకు ఆదేశించింది.

 

మరిన్ని వార్తలు