ఆఖరి పోరులో సాగని జోరు

12 Dec, 2016 15:22 IST|Sakshi
ఆఖరి పోరులో సాగని జోరు

ఫైనల్లో ఓడిన సింధు, సమీర్ వర్మ 
రజత పతకాలతో సరి 
హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ 

కౌలూన్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోరుుంది. హాంకాంగ్ ఓపెన్ టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు కనబర్చిన సింధు, ఫైనల్లో పరాజయం పాలైంది. మరోవైపు సంచలన ఆటతో పురుషుల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత ఆటగాడు సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల ఫైనల్లో సింధు 15-21, 17-21 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) 21-14, 10-21, 21-11 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు. రన్నరప్‌లుగా నిలిచిన సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 7,800 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు.

రన్నరప్ సిక్కి రెడ్డి జంట
మరోవైపు గ్లాస్గోలో ముగిసిన స్కాటిష్ ఓపెన్‌గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ ద్వయం సిక్కి-ప్రణవ్ 21-13, 18-21, 16-21తో ప్రపంచ 229వ ర్యాంక్ జోడీ గో సూన్ హువాట్-జేమీ లై షెవోన్ (మలేసియా) చేతిలో ఓడిపోరుుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కి-ప్రణవ్ 16-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా 9 పారుుంట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. 

నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మెరుగ్గానే ఆడినా ప్రత్యర్థి నెట్ వద్ద చాలా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆమె ఎలాంటి తప్పులూ చేయలేదు. గతంలోనూ తై జుతో ఆడాను. ఆమె బలాల గురించి తెలిసే సన్నద్ధమయ్యా. అరుుతే ఆటలో ఓటమి సహజం. గత వారం చైనా ఓపెన్ గెలుపు కారణంగా నేను ఈ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఈ రోజు ఆమెది. తిరిగి వెళ్లాక మరింతగా సాధన చేస్తా. వరుసగా రెండు టోర్నీల్లో నా ఆట సంతోషాన్ని కలిగించింది. - పీవీ సింధు 

మరిన్ని వార్తలు