'విరాట్ గ్యాంగ్పైనే తీవ్ర ఒత్తిడి'

14 Mar, 2017 12:11 IST|Sakshi
'విరాట్ గ్యాంగ్పైనే తీవ్ర ఒత్తిడి'

రాంచీ: తమతో ఇంకా రెండు టెస్టు మ్యాచ్లు మిగిలిన ఉన్న సిరీస్ లో టీమిండియాపైనే ఒత్తిడి తీవ్రంగా ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ లో ఆసీస్ ఎటువంటి ఒత్తిడి లేకుండానే బరిలోకి దిగిందనే విషయం విరాట్ సేనకు తెలుసన్నాడు. ఈ క్రమంలో సిరీస్ ను గెలవాలన్న ఒత్తిడి వారిపై విపరీతంగా ఉందన్నాడు.

'భారత్ తో సిరీస్ లో భాగంగా మేము దుబాయ్ లో అడుగుపెట్టినప్పుడు అపారమైన నమ్మకంతో ఉన్నాం. కానీ భారత్ కు వచ్చిన తరువాత సిరీస్ ను 4-0 తో కోల్పోతున్నామనే వార్తలు వచ్చాయి. ప్రతీ ఒక్కరు కూడా మాతో అదే చెబుతూ వచ్చారు. మా జట్టు భారత్ పై విజయం సాధించడం అంత ఈజీ కాదన్నారు. 

మమ్మల్ని ఇంకా నేర్చుకునే జట్టుగానే అభివర్ణించారు. కాకపోతే ప్రపంచంలో ఎంత అత్యుత్తమ జట్టుపైనైనా గెలుపొందే సత్తా ఆస్ట్రేలియాకు ఉంది. అదే తొలి టెస్టులో నిరూపించాం కూడా.రెండో టెస్టులో ఓడటం కొద్దిగా బాధించింది.  మూడో టెస్టులో తిరిగి సత్తా చాటుతాం. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో భారత్ పైనే తీవ్ర ఒత్తిడి ఉంది.. మాపై ఎంతమాత్రం కాదు' అని లియాన్ తెలిపాడు. గురువారం రాంచీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు