16 ఏళ్ల తర్వాత...

31 May, 2016 00:07 IST|Sakshi
16 ఏళ్ల తర్వాత...

 ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం దెబ్బ  సోమవారం మ్యాచ్‌లన్నీ రద్దు

పారిస్: వారం రోజులుగా సంచలన ఫలితాలతో సాగుతోన్న టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో సోమవారం షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని మ్యాచ్‌లను రద్దు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఒక రోజు ఒక్క మ్యాచ్ కూడా సాధ్యపడకపోవడం 16 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి సరిగ్గా 16 ఏళ్ల క్రితం 2000లో మే 30వ తేదీన ఫ్రెంచ్ ఓపెన్‌లో వర్షం కారణంగా ఒక్క మ్యాచ్ జరగలేదు.

నిషికోరి కూడా అవుట్: ఆదివారం ఆలస్యంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరో సంచలనం నమోదైంది. ఐదో సీడ్ కీ నిషికోరి పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. తొమ్మిదో సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-4, 6-2, 4-6, 6-2తో నిషికోరిని బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో గాస్కే; రామోస్  (స్పెయిన్)తో వావ్రింకా తలపడతారు.

>
మరిన్ని వార్తలు