సీబీఐ విచారణలో నిజాలు తెలుస్తాయి

2 Sep, 2017 00:51 IST|Sakshi
సీబీఐ విచారణలో నిజాలు తెలుస్తాయి

రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ ఆశాభావం

ముంబై: సీబీఐ విచారణలో తాను నిష్కళంకుడిగా తేలతానని డోపింగ్‌ కారణంగా నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న భారత రెజ్లర్‌ నర్సింగ్‌ యాదవ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అసలు విషయం తెలుస్తుంది. న్యాయం నా పక్షానే ఉంటుందని నమ్ముతున్నాను. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటే పతకం సాధించేవాణ్ణి. ఎందుకంటే ఆ గేమ్స్‌ విజేతను నేను గతంలోనే ఓడించాను. ప్రస్తుతం నా ప్రాక్టీస్‌ను ఆపలేదు.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఉన్నాను’ అని 28 ఏళ్ల నర్సింగ్‌ యాదవ్‌ తెలిపాడు. ఎవరో కావాలని తన శాంపిల్‌ను టాంపరింగ్‌ చేశారని, అందుకే ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని నర్సింగ్‌ అప్పట్లో ఆరోపించాడు. దీంతో అసలు విషయం తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది.

మరిన్ని వార్తలు