క్రికెట్‌లో కలకలం.. యాషెస్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు

9 Feb, 2018 09:05 IST|Sakshi
స్మిత్‌, జోయ్‌రూట్‌(ఫైల్‌పొటో)

ఐపీఎల్‌ ను సైతం ఫిక్సింగ్‌ చేశారంటూ 'ది సన్‌' వ్యాఖ్యలు

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ మధ్య ప్రతిష్టాత్మకంగా జరిగే యాషెస్‌ సిరీస్‌పై ఐసీసీ పలు అనుమానాలు వ్యక్తం చేసినట్లు ది సన్‌ అనే అంతర్జాతీయ వార్త పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గత డిసెంబర్‌లో పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆటగాళ్లు స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు సంచలన ఆరోపణలు చేసింది. సెషన్‌కు రూ.60 లక్షలు, రెండు సెషన్లకు 120 లక్షల చొప్పున బుకీలు బేరాలు ఆడినట్లు తెలిపింది. దీనిపై అన్ని ఆధారాలు ఐసీసీ వద్ద ఉన్నాయని 'ది సన్‌' ప్రచురించింది.  అంతేకాదు దీనిపై ఐసీసీ రహస్య విచారణకు  ఆదేశించినట్లు పేర్కొంది. భారత్‌కు చెందిన బుకీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయడానికి ప్రయత్నించారని ఆరోపించింది.

అయితే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఐసీసీ స్పందించింది. విచారణలో ఇరు జట్ల ఆటగాళ్లు, స్టాఫ్‌ ఎటువంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది.  ఐసీసీ అవినీతి నిరోధక శాఖ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మెర్షల్‌ మాట్లాడుతూ యాషెస్‌ ఫిక్సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై విసృతస్థాయిలో విచారణ జరిపామని తెలియచేశారు. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆటగాళ్లు, జట్టు సభ్యులు, కోచ్‌, సహాయకులు ఇలా ప్రతిఒక్కరిని వ్యక్తిగతంగా విచారించామని, ఏ ఒక్కరు బుకీలతో ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు నిరూపితం కాలేదని మెర్షల్‌ పేర్కొన్నారు.

ఇక బుకీ తెలిపిన వివరాల ప్రకారం గతంలో భారత్‌లో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను, ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ టీ20 లీగ్‌ల్లోను ఫిక్సింగ్ చేసినట్లు ది సన్‌ ప్రచురించింది. సదరు పత్రిక జరిపిన స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో మ్యాచ్‌ బుకీ తెలుపినట్లు పేర్కొంది. ఒక ప్రపంచకప్‌ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌తోపాటు, పలు అవినీతి నిరోధక శాఖలతో కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు మరో బుకీ తెలిపాడని ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టులో 'ది సైలెంట్‌ మ్యాన్‌'గా పేరొందిన ఆటగాడు ఈఫిక్సింగ్‌కు చేసినట్లు తమ స్ట్రింగ్‌ ఆపరేషన్‌లో వెల్లడైందని 'ది సన్‌' ఆరోపించింది.

మరిన్ని వార్తలు