వికెట్లను కొట్టినా ఔట్‌ కాలేదు!

17 Jun, 2019 19:29 IST|Sakshi

టాంటాన్‌: క్రికెట్‌లో హిట్‌ వికెట్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాట్స్‌మన్‌ తనకు తాను వికెట్లను కొడితే హిట్‌ వికెట్‌గా పరిగణిస్తారు. అది మన పరిభాషలో చెప్పుకోవాలంటే సెల్ఫ్‌ ఔట్‌ అంటాం. అయితే బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టినా అది ఔట్‌ కాకపోతే అది కాస్త ఆలోచించాల్సిన విషయమే. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా సోమవారం బంగ్లాదేశ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘటన కనిపించింది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ముస్తాఫిజుర్‌ 49 ఓవర్‌ ఐదో బంతిని ఆఫ్‌ సైడ్‌ యార్కర్‌గా సంధించాడు. అది కాస్తా స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న ఓష్నీ థామస్‌ దాటుకుని కీపర్‌ రహీమ్‌ చేతుల్లోకి వెళ్లింది.
(ఇక్కడ చదవండి: వెస్టిండీస్‌ ఇరగదీసింది)

ఆపై థామస్‌ వికెట్లను బ్యాట్‌తో కొట్టాడు. ఆ క్రమంలోనే బెయిల్స్‌ కూడా పడటం జరిగింది. దీనిపై అనుమానం వచ్చిన ఫీల్డ్‌ అంపైర్లు.. థర్డ్‌ అంపైర్‌కు అప్పీల్‌ చేశారు. కాగా, ఇది ఔట్‌ కాదని తేలింది. సదరు బంతిని థామస్‌ ఆడే క్రమంలో ఆ షాట్‌ పూర్తయిన తర్వాతే వికెట్లను బ్యాట్‌తో తాకడంతో థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. ఇది పెద్ద విషయం కాకపోయినా, బ్యాట్స్‌మన్‌ వికెట్లను కొట్టినా ఎందుకు ఔట్‌ ఇవ్వలేదనేది సగటు క్రీడాభిమానికి వచ్చే ఆలోచన. కాగా, థర్డ్‌ అంపైర్‌ నిర్ణయంతో దీనిపై స్పష్టత రావడంతో ఇదా విషయం అనుకోవడం అభిమానుల వంతైంది.Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సారీ న్యూజిలాండ్‌...

లార్డ్స్‌ నుంచి లార్డ్స్‌ వరకు...

ప్రపంచ కల నెరవేరింది

ప్రపంచకప్‌ 2019: పుట్టినింటికే చేరింది

మ్యాట్‌ హెన్రీ అరుదైన ఘనత

ఇంగ్లండ్‌ ఛేదిస్తుందా.. చతికిలబడుతుందా?

కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు

ఇంకా ధోని గురించి ఎందుకు?

ఇలా అయితే ఎలా?: యువరాజ్‌ సింగ్‌

ఫైనల్‌ అప్‌డేట్స్‌: విశ్వవిజేతగా ఇంగ్లండ్‌

‘జడేజాను ఓదార్చడం మా వల్ల కాలేదు’

‘మదర్‌’ మిమిక్రీకి ఫిదా అయిన బుమ్రా..!

విశ్వ కిరీటం... పుట్టింటికా? కివీ గూటికా?

‘కప్‌ గెలిచి.. తలెత్తుకునేలా చేయండి’

ఇదొక చెత్త ప్రదర్శన: పాంటింగ్‌

‘మరీ ఇంత సింపుల్‌గానా.. గ్రేట్‌’

ఇక టీమిండియా కెప్టెన్‌ రోహితేనా?

కివీస్‌తో అంత ఈజీ కాదు: మోర్గాన్‌

నువ్వు లేకుండా.. ప్రపంచకప్‌ గెలవడమా?

‘అప్పటికీ భయపడుతూనే ఉన్నా’

భారత క్రికెట్‌ జట్టులో గ్రూపు తగాదాలు?

చరిత్ర సృష్టించనున్న విలియమ్సన్‌

నేను డిమాండ్‌ చేయలేదు: డివిలియర్స్‌

బీజేపీలోకి ధోని : కేంద్ర మాజీమంత్రి

‘డియర్‌ భారత్‌ ఫ్యాన్స్‌.. ఫైనల్‌ టికెట్లు అమ్మండి’

‘ఫైనల్‌’ అంపైర్లు ధర్మసేన, ఎరాస్మస్‌

‘4’లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ లేకే ఓడాం

కప్పు కొట్లాటలో...