‘అజహర్‌ స్టాండ్‌’

29 Nov, 2019 05:03 IST|Sakshi

ఉప్పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం

భారత్‌ – వెస్టిండీస్‌ టి20 మ్యాచ్‌కు నేటినుంచి టికెట్ల అమ్మకాలు

కనీస ధర రూ. 800

సాక్షి, హైదరాబాద్‌: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ పేరిట ఒక స్టాండ్‌ ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌సీఏ అపెక్స్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నార్తర్న్‌ పెవిలియన్‌లోని స్టాండ్స్‌లలో ఒకదానికి అజహర్‌ స్టాండ్‌గా వ్యవహరిస్తారు. డిసెంబర్‌ 6న భారత్, వెస్టిండీస్‌ మధ్య ఇక్కడ జరిగే తొలి టి20 మ్యాచ్‌ సమయంలో అధికారికంగా స్టాండ్‌కు పేరు పెడతామని హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు జాన్‌ మనోజ్‌ వెల్లడించారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్‌ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్, వెంకటపతిరాజులను భవిష్యత్తుల్లో ఇదే తరహాలో గౌరవిస్తామని కూడా ఆయన చెప్పారు. మరో వైపు సౌత్‌ పెవిలియన్‌ బ్లాక్‌లోని ఒక లాంజ్‌కు హెచ్‌సీఏ మాజీ సంయుక్త కార్యదర్శి ఆర్‌.దయానంద్‌ పేరు పెట్టనున్నారు.

గరిష్ట విలువ రూ. 12,500/– 
టి20 మ్యాచ్‌ కోసం నేటినుంచి టికెట్ల అమ్మ కాలు ప్రారంభిస్తున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహర్‌ ప్రకటించారు. క్రికెట్‌ పరిపాలకుడిగా ఇది తనకు తొలి మ్యాచ్‌ అని, దీనిని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. టికెట్లను ఆన్‌లైన్‌లో  ఠీఠీఠీ. ్ఛఠ్ఛిn్టటnౌఠీ. ఛిౌఝలో కొనుగోలు చేయవచ్చు. టికెట్ల ధరలను రూ.800, రూ.1000, రూ.1500, రూ.4000, రూ.5000, రూ.7500, రూ.10000, రూ.12500గా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు