తిలక్‌వర్మ సెంచరీ

19 Aug, 2016 12:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బ్రదర్స్ ఎలెవన్ బ్యాట్స్‌మన్ ఠాకూర్ తిలక్‌వర్మ (123) శతక్కొట్టాడు. దీంతో ఎ-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో సలీమ్‌నగర్‌తో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటిరోజు సలీమ్‌నగర్ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగుల వద్ద ఆలౌటైంది. రెండో రోజు గురువారం ఆటలో బ్రదర్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసి ఆలౌటైంది. తిలక్‌వర్మ సెంచరీ సాధించగా, కార్తీకేయన్ (50) రాణించాడు. సలీమ్‌నగర్ బౌలర్లలో సమీ అన్సారి 5, షాహిద్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన సలీమ్‌నగర్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.


 తొలి రోజు స్కోర్లు


నిజామ్ కాలేజి: 388/7 డిక్లేర్డ్ (సాయి కుమార్ 163; అన్వేశ్ రెడ్డి 127, అక్షయ్ 38; అజిత్ కుమార్ 5/89), బాలాజీ కోల్ట్స్: 45/0.     {Xన్‌టర్ఫ్: 202 (సయ్యద్ అస్కారి 90; మహబూబ్ 3/13, ఆదిత్య 3/19), మహమూద్ సీసీ: 99/7 (గణేష్ 30; సాయి శ్రాగ్వి 3/28, తిశాంత్ గుప్తా 3/44).  డెక్కన్ బ్లూస్: 272 (హర్షవర్ధన్ సింగ్ 64, హర్షవర్ధన్ 56; విశాల్ సింగ్ 5/73, సయ్యద్ పాషా 3/36), అగర్వాల్ సీనియర్స్: 48/2.  విజయ్ హనుమాన్: 386/7 డిక్లేర్డ్ (మెహర్ ప్రసాద్ 100, రంగనాథ్ 78, సాయి కుమార్ 51), పీకేఎంసీసీ: 19/0.  నేషనల్ సీసీ: 208 (వినయ్ 68), ఎస్‌బీఐ: 77/2 (నాగ శ్రీనివాస్ 32 బ్యాటింగ్).

మరిన్ని వార్తలు