‘నా జీవితంలోనే అత్యంత కఠినమైన రోజు’

20 Jun, 2018 20:56 IST|Sakshi
ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌

నాటింగ్‌హామ్‌ : ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన వన్డేలో 242 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో టిమ్‌ పెయిన్‌ సేన దారుణంగా విఫలమైన నేపథ్యంలో వన్డే క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఆసీస్‌ భారీ ఓటమిపై కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ మాట్లాడుతూ.. ‘చిన్ననాటి నుంచే క్రికెట్‌ ఆడుతున్నాను. కానీ ఈరోజు(మంగళవారం) నా జీవితంలో అత్యంత కఠినమైన రోజు. మా ప్రయత్నాలేవీ ఫలించలేదు. కానీ వాళ్లు(ఇంగ్లండ్‌) మాపై సునాయాసంగా పైచేయి సాధించారు. మా మెడపై కత్తి పెట్టినంత పని చేశారు. ఈ రోజు ఆటలో మేము చిన్న చిన్న విషయాలను కూడా మర్చిపోయాం. మా ప్రణాళికను అమలు చేయడంలో కొంచెం కూడా సఫలం కాలేకపోయామని’ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ చెత్త ప్రదర్శన నుంచి పాఠాలు నేర్చుకుంటున్నామన్న టిమ్‌.. ఓటమి కూడా ఒక్కోసారి మంచి చేస్తుందని.. తమకు ఇదొక ఒక కనువిప్పులాంటిదని వ్యాఖ్యానించాడు. రాబోయే మ్యాచ్‌లలో తమ వ్యూహాలను పక్కాగా అమలు చేసి గెలుపొందుతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మ్యాచ్‌ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఇంగ్లండ్‌ జట్టు మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే 5 వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా