టీటీ బాలికల సింగిల్స్ విజేత హనీఫా

4 Nov, 2014 00:39 IST|Sakshi
టీటీ బాలికల సింగిల్స్ విజేత హనీఫా

మాంట్‌ఫోర్ట్ క్రీడలు

 ఎల్బీ స్టేడియుం: మాంట్‌ఫోర్ట్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన హనీఫా (సెరుుంట్ పాల్స్ హైస్కూల్) చేజిక్కించుకుంది. నల్లగొండ పట్టణంలోని సెరుుంట్ ఆల్ఫాన్స హైస్కూల్‌లో సోవువారం జరిగిన టేబుల్ టెన్నిస్ బాలికల సింగిల్స్ ఫైనల్లో హనీఫా 11-12, 11-8, 11-9, 11-6 స్కోరుతో రుచిరరెడ్డి (సెరుుంట్ పాల్స్ హైస్కూల్)పై గెలిచింది. టీమ్ ఈవెంట్  టైటిల్‌ను సెరుుంట్ పాల్స్ హైస్కూల్ జట్టు సాధించింది. ఫైనల్లో ఈ జట్టు... సెయింట్ మాథ్యూస్ హైస్కూల్ (విజయవాడ)పై నెగ్గింది.

మరిన్ని వార్తలు