చూసేద్దామా... ఐస్‌ క్రికెట్‌! 

8 Feb, 2018 01:33 IST|Sakshi
కృత్రిమ కార్పెట్‌ పిచ్‌

నేడు, రేపు స్విట్జర్లాండ్‌లో టి20 మ్యాచ్‌లు

బరిలో సెహ్వాగ్, ఆఫ్రిది, జహీర్, కైఫ్‌

సెయింట్‌ మోరిట్జ్‌ (స్విట్జర్లాండ్‌): నేలపై క్రికెట్‌ సాధారణం. బీచ్‌లో క్రికెట్‌ కొంచెం కష్టం. మరి హిమ తాపంలో ఐస్‌ క్రికెట్‌ సంక్లిష్టం. కానీ ఈ తరహా క్రికెట్‌కు ప్రపంచ దిగ్గజాలు సై అంటున్నారు. భారత్‌ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, కైఫ్, జహీర్‌ ఖాన్, అగార్కర్, రమేశ్‌ పవార్‌ కొత్త థ్రిల్‌కు సిద్ధమయ్యారు. ఇతర దేశాల నుంచి కలిస్, గ్రేమ్‌ స్మిత్, వెటోరి, దిల్షాన్, మలింగ, అక్తర్, షాహిద్‌ ఆఫ్రిది తదితర పేరొందిన క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. దీంతో స్విస్‌లో ఐస్‌ క్రికెట్‌ హంగామా దిగ్గజాలతో జరుగనుంది.

ఐస్‌పై ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ కార్పెట్‌ పిచ్‌పై రెండు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడ రాత్రి అయితే ఉష్ణోగ్రతలు–20 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. రక్తం గడ్డకట్టే పరిస్థితిలో ఆడే ఆట ఇది. ప్రపంచ దిగ్గజాలను టీమ్‌ రాయల్స్, బడ్రుట్‌ ప్యాలెస్‌ డైమండ్స్‌ జట్లకు ఎంపిక చేశారు నిర్వాహకులు. గురువారం, శుక్రవారం ఒక్కో మ్యాచ్‌ జరుగుతుంది. 

మ.గం.3.30  నుంచి సోని ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం 

మరిన్ని వార్తలు