టోక్యో చేరిన ఒలింపిక్ పతాకం

25 Aug, 2016 00:42 IST|Sakshi
టోక్యో చేరిన ఒలింపిక్ పతాకం

టోక్యో: ఒలింపిక్ పతాకం తదుపరి ఆతిథ్య నగరం టోక్యో చేరుకుంది. జపాన్ రాజధానిలో 2020 ఒలింపిక్స్ జరగనున్న సంగతి తెలిసిందే. రియో ముగింపు వేడుకల్లో ఒలింపిక్ జెండాను లాంఛనంగా అందుకున్న టోక్యో గవర్నర్ యురికొ కొయికె అక్కడి నుంచి బుధవారం ఇక్కడి హనెడా విమానాశ్రయానికి వచ్చారు. జెండాతో స్వదేశంలో దిగగానే ఆమె మాట్లాడుతూ ‘మేం పెద్ద బాధ్యతనే తీసుకున్నాం. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్ జెండా మా దేశానికి వచ్చింది’ అని అన్నారు.


జపాన్ చివరిసారిగా 1964లో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. రియో నుంచి టోక్యోకు ఒలింపిక్ ఫ్లాగ్ రావడంపై సరదాగా ఓ వీడియోగేమ్ రూపొందింది. ఇందులో జపాన్ ప్రధాని షింజో ఏబ్ సూపర్ మారియోగా... రియోలోని భూభాగాన్ని తొలుస్తూ టోక్యోలో భూమిని చీల్చుకుంటూ వస్తాడు. ఈ కామికల్ విడియోగేమ్‌పై జపాన్ ప్రజల ఆసక్తిని తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు ప్రధాని షింజో ఏబ్ చెప్పారు.

 

 

మరిన్ని వార్తలు