టోక్యో ఒలింపిక్స్‌ పతకాల ఆవిష్కరణ

25 Jul, 2019 09:52 IST|Sakshi

టోక్యో: ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో విజేతలకు ప్రదానం చేసే పతకాలను ఆతిథ్య దేశం జపాన్‌ బుధవారం విడుదల చేసింది. ఆ దేశ రాజధాని నగరం టోక్యో వేదికగా జరుగనున్న విశ్వ క్రీడా పండుగకు సరిగ్గా ఏడాది వ్యవధి ఉన్న నేపథ్యంలో బుధవారం వీటిని ప్రజల ముందుకు తెచ్చింది. దీంతో నగరవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. 1976 క్రీడల ఫెన్సింగ్‌ స్వర్ణ పతక విజేత, అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌.. పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టోక్యో సన్నాహాలు అత్యద్భుతంగా సాగుతున్నాయని ఆయన కొనియాడారు. 20 బిలియన్‌ డాలర్ల వ్యయంతో ఒలింపిక్స్‌ నిర్వహించాలని జపాన్‌ ప్రణాళికలు వేస్తోంది.

>
మరిన్ని వార్తలు