కరోనా ఎఫెక్ట్‌: అనుకున్నట్లే వాయిదా పడింది..

24 Mar, 2020 19:05 IST|Sakshi

టోక్యో: జపాన్‌ వేదికగా జులై 24 నుంచి ప్రారంభం కావాల్సిన అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్‌ అందరూ ఊహించనట్టే వాయిదా పడింది. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) ఉత్పాతం ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సంచలన నిర్ణయం తీసుకుంది. సభ్య దేశాలన్ని ముక్త కంఠంతో ఒలింపిక్స్‌ను రద్దు లేదా వాయిదా వేయాలని కోరడంతో ఐఓసీ కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలింపిక్స్‌–2020ను ఏడాది పాటు వాయిదా వేయాలని జపాన్‌ దేశ ప్రధాని షింజో అబె, ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ సంయుక్తంగా నిర్ణయించనట్టు ఒలింపిక్స్‌ నిర్వాహకుల ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవి తర్వాత ఒలింపిక్స్‌-2021 గురించి ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కరోనా వైరస్‌ అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతున్న సమయంలో క్రీడల మహాసంగ్రామం వాయిదా వేయాలని అన్ని వైపుల డిమాండ్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కాగా, ఆది నుంచి ఒలింపిక్స్‌ నిర్వహణపై ఐఓసీ ధీమాగానే ఉంది. నాలుగు వారాల్లో ఒలింపిక్స్‌పై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే సోమవారం జపాన్‌ ప్రధాని షింజో అబె ఆ దేశ పార్లమెంట్‌లో ‘ఒలింపిక్స్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతే వాటిని వాయిదా వేయడమే మంచిది. అథ్లెట్ల ఆరోగ్య భద్రత అన్నింటికంటే ప్రధానం కాబట్టి వాయిదా తప్పకపోవచ్చు. ఒక వేళ వాయిదా తప్పదనుకుంటే ఐఓసీ ఆ నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలి. వాయిదాతో ముడిపడిన అనేక సమస్యలను పరిష్కరించుకునేందుకు తగినంత సమయం ఉండాలి. అయితే ఒలింపిక్స్‌ రద్దయ్యే అవకాశం ఏమాత్రం లేదు’అని స్పష్టం చేసిన విషయం తెలసిందే. దీంతో ఐఓసీ మెత్త పడి వాయిదా వైపు మొగ్గు చూపింది. 

చదవండి:
‘24 ఏళ్ల తర్వాత ఆసీస్‌ను ఓడించారు’
ఐపీఎల్‌ 2020 రద్దు! 

మరిన్ని వార్తలు