అతని వల్లే ఓడాం: టామ్‌ మూడీ

28 May, 2018 15:48 IST|Sakshi
టామ్‌ మూడీ

ముంబై: ఐపీఎల్‌-11 సీజన్‌ ఫైనల్లో తమ ఓటమికి చెన్నై సూపర్‌ కిం‍గ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సనే కారణమని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ హెడ్‌ కోచ్‌ టామ్‌ మూడీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం మూడీ మాట్లాడుతూ.. ‘వాట్సన్‌ ఇన్నింగ్స్‌ ప్రత్యేకం. మేం పోరాడే లక్ష్యాన్ని నిర్ధేశించాం. కానీ తన ప్రత్యేకమైన ఆటతో మా విజయాన్నిలాగేసుకున్నాడు. ఈ సీజన్‌ అద్భుతంగా సాగింది. మేం ఇంట (హోం గ్రౌండ్‌), బయట అద్భుతంగా రాణించాం. కొన్ని మ్యాచ్‌లు ఓడినప్పటికి టోర్నీలో మాపై అంతగా ప్రభావం చూపలేదు. కేన్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తనలోని మూడు కోణాలను ప్రపంచానికి చాటి చెప్పాడు. రషీద్‌ గొప్ప క్రికెటర్‌. భారత అభిమానులు మాత్రమే కాదు ప్రపంచం మొత్తం అతని మాయలో పడిపోయింది. బౌలింగ్‌లోనే కాదు.. మైదానంలోని అతని కమిట్‌మెంట్‌ చాలా గొప్పది’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో షేన్‌ వాట్సన్‌ అద్భుత సెంచరీతో చెన్నై టైటిల్‌ నెగ్గిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణలో ఆర్థిక దోపిడీ పెరిగింది: ఏచూరి

నా బంగారమే నన్ను మార్చేసింది: ధోని

గబ్బర్‌ కబడ్డీ పోజ్‌.. ఎందుకంటే

ధోనికి, నాకు బాగా కలిసొచ్చింది..!

కోహ్లి బ్యాట్‌తోనే రాణించా: రాయుడు

అందుకే చెన్నై గెలిచింది : గంభీర్‌

విమానంలో కింగ్స్‌ సందడి

రాయుడు Vs భజ్జీ : ఎన్నోసార్లు సారీ చెప్పా

అసలు చాపెల్‌ ఎవడు : గేల్‌ ఫైర్‌

మోస్ట్‌ పాపులర్‌ నేనేనేమో: రషీద్‌ ఖాన్‌

సన్‌రైజర్స్‌ మెరుపులు సరిపోలేదు

ధోనీ vs బ్రేవో : గెలిచిందెవరు?

ఇతను లక్కీ అయితే.. అతను అన్‌ లక్కీ

‘భారత పౌరసత్వం’పై రషీద్‌ స్పందన..

ధోని ఖాతాలో మరో రికార్డు

ఐపీఎల్‌లో ఫ్లాప్‌ స్టార్స్‌