టోనీ ఉరా వన్‌ మ్యాన్‌ షో

6 Mar, 2018 18:22 IST|Sakshi

హరారే: వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భాగంగా మంగళవారం ఇక్కడ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పపువా న్యూ గునియా ఆటగాడు టోనీ ఉరా వన్‌ మ్యాన్‌ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పపువా న్యూ గునియా 50 ఓవర్లలో 235 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఓపెనర్‌ టోనీ ఉరా 151 పరుగులతో దుమ్ములేపాడు. 142 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఫలితంగా  పపువా న్యూ గునియా గౌరవప్రదమైన స్కోరును సాధించింది.

అయితే అంతర్జాతీయ వన్డేల్లో ఒక జట్టు పూర్తిగా ఇన్నింగ్స్‌ ఆడి చేసిన స్కోరులో అత్యధిక శాతం వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టోనీ నాల్గో స్థానంలో నిలిచి కొత్త  అధ్యాయం లిఖించాడు. ఈ మ్యాచ్‌లో టోనీ ఉరా పరుగుల శాతం 64.3 శాతంగా నమోదైంది.  అంతకుముందు వివియన్‌ రిచర్డ్స్ ‌( 189 నాటౌట్‌, వెస్టిండీస్‌, 1984లో ఇంగ్లండ్‌పై వన్డేలో) 69.5 శాతం పరుగులు సాధించి తొలి స్థానంలో కొనసాగుతుండగా, కపిల్‌ దేవ్‌(175 నాటౌట్‌, భారత్‌, 1983లో జింబాబ్వేపై వన్డేలో) 65.8 శాతం పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక రోహిత్‌ శర్మ(264, భారత్‌,  2014లో శ్రీలంకపై వన్డేలో) 65.3 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరిన్ని వార్తలు