విజేతలు తుషార్, ఐశ్వర్య

24 Sep, 2019 10:17 IST|Sakshi

స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో తుషార్‌ కొఠారి, ఐశ్వర్య పయ్యన్‌ విజేతలుగా నిలిచారు. మాదాపూర్‌లోని గేమ్‌ పాయింట్‌ వేదికగా ఆదివారం జరిగిన పురుషుల ఫైనల్లో రవి పాండేపై తుషార్‌.. మహిళల తుదిపోరులో సుజాత పయ్యన్‌పై ఐశ్వర్య పయ్యన్‌ గెలుపొంది ట్రోఫీలను కైవసం చేసుకున్నారు. అండర్‌–17 బాలబాలికల విభాగాల్లో రోహన్‌ ఆర్య, ఐశ్వర్య చాంపియన్‌లుగా నిలిచారు. ఫైనల్లో ధ్రువ్‌కుమార్‌పై రోహన్‌ గెలుపొందగా, ఖుషిని ఐశ్వర్య ఓడించింది. అండర్‌–15 బాలుర ఫైనల్లో ధ్రువ్‌ కుమార్‌పై రోహన్‌ ఆర్య గెలుపొంది టైటిల్‌ను అందుకున్నాడు.

అండర్‌–13 బాలికల టైటిల్‌పోరులో శాని్వశ్రీపై ఆర్య, బాలుర తుదిపోరులో వివాన్‌పై రాజ్‌వీర్‌ గెలిచారు. అండర్‌–11 బాలుర విభాగంలో ఏకాన్ష్‌ ఆనంద్‌ను ఓడించి రాజ్‌వీర్‌ గ్రోవర్‌ విజేతగా నిలిచాడు. 45 ఏళ్లు పైబడిన పురుషుల విభాగంలో అరవింద్, రవికృష్ణ తొలి స్థానాలను దక్కించుకున్నారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. రంగారావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా