రాజా డబుల్‌ ధమాకా

2 Oct, 2019 10:20 IST|Sakshi

జంట నగరాల టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రాజా రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. బోయిన్‌పల్లి కృష్ణస్వామి అడ్వాన్స్‌డ్‌ టెన్నిస్‌ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో రాజా విజేతగా నిలిచాడు. పురుషుల ఫైనల్లో రాజా 6–2తో సంతోష్‌పై నెగ్గాడు. డబుల్స్‌ టైటిల్‌పోరులో రాజా–దిలీప్‌ కుమార్‌ జంట 6–1తో ఆదిత్య–క్రిస్‌ అలెన్‌ జేమ్స్‌ జోడీని ఓడించింది. అండర్‌–18 ఫైనల్లో లలిత్‌ మోహన్‌ 6–5 (5)తో విజయ్‌ తేజ్‌ రాజుపై, తేజస్వీ 6–5 (5)తో లహరికపై గెలుపొందారు.

అండర్‌–16 బాలుర ఫైనల్లో విజయ్‌ తేజ్‌ రాజు 6–0తో రిషి శర్మను చిత్తుగా ఓడించాడు. అండర్‌–14 కేటగిరీలో రిషి శర్మ, తేజస్వీ టైటిళ్లను హస్తగతం చేసుకున్నారు. ఫైనల్లో రిషి శర్మ 6–5 (5)తో ధీరజ్‌పై గెలుపొందగా... తేజస్వీ 6–2తో శ్రీకా రెడ్డిని ఓడించింది. అండర్‌–12 బాలుర ఫైనల్లో ధీరజ్‌ 6–3తో వేదాన్‌‡్షపై, బాలికల తుదిపోరులో శ్రీకారెడ్డి 6–3తో దీక్షితపై గెలుపొందారు. అండర్‌–10 విభాగంలో ధ్రువ, సృష్టి విజేతలుగా నిలిచారు. బాలుర ఫైనల్లో ధ్రువ 6–4తో చంద్రపై నెగ్గాడు. బాలికల ఫైనల్లో సృష్టి 6–0తో మాన్యారెడ్డిని ఓడించింది. అండర్‌–8 విభాగంలో కబీర్‌ 6–2తో కార్తికేయపై గెలుపొందాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా