భళారే అఫ్గాన్‌ భళా !

26 Sep, 2018 15:41 IST|Sakshi
అఫ్గాన్‌ ఆటగాళ్ల ఆనందం

అఫ్గాన్‌ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు

దుబాయ్‌ : ఆసియాకప్‌లో అఫ్గానిస్తాన్‌ ప్రదర్శన ఔరా అనిపించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బలమైన భారత్‌ను ఓడించినంత పనిచేసింది. ఓటమి అంచుల్లో ఉన్న ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా చివరి వరకు పోరాడి మ్యాచ్‌ను కాపాడుకుంది. భారత్‌తోనే కాకుండా టోర్నీ అద్యాంతం తమ ప్రదర్శనతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తమ ఆటతో తమది పసికూన జట్టు కాదని క్రికెట్‌ను శాసించే దేశాలను హెచ్చిరించింది. అఫ్గాన్‌ ఆటగాళ్ల ప్రదర్శనకు మాజీ క్రికెటర్లు, అభిమానులు సలాం కొడుతున్నారు. ట్విటర్‌ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత్‌తో డ్రా అంటే గెలిచినట్టేనని, భారత అభిమానులే కొనియాడుతున్నారు. (చదవండి: నేను రివ్యూకు వెళ్లాల్సింది కాదు)

‘క్రికెట్‌లోనే ఇదో గొప్ప మ్యాచ్‌. వరల్డ్‌ క్లాస్‌ జట్టు అయిన భారత్‌పై అఫ్గానిస్తాన్‌ ప్రదర్శన అత్యద్భుతం. మహ్మద్‌ షజాద్‌ శతకానికి అర్హుడే. అఫ్గాన్‌ ఆటగాళ్ల పురోగతి అద్భుతం. యావత్‌ క్రికెట్‌ ప్రపంచం చూడాల్సిన మ్యాచే’- షాహిద్‌ అఫ్రిదీ (పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌)

‘అఫ్గాన్‌కు ఇదో ప్రత్యేకమైన రోజు. భారత్‌పై డ్రా సాధించడం.. ప్రతి ఆఫ్గాన్‌ ఆటగాడికి ఓ మైలురాయి కాకుండా గర్వకారణం కూడా. అఫ్గాన్‌ జట్టులో ఎదో ప్రత్యేకత ఉంది’-వీవీఎస్‌ లక్ష్మణ్‌

‘దీనికి అఫ్గాన్‌ ఆటగాళ్లు అర్హులే. మ్యాచ్‌ డ్రా అయింది కానీ వారి ప్రదర్శనను చూసి నమ్మలేకపోతున్నా. అఫ్గాన్‌ గర్వించాల్సిందే. వారు నిజమైన విన్నర్స్‌’- కైఫ్‌

(చదవండి: ఊరించి... ఉత్కం‘టై’) 

మరిన్ని వార్తలు