ధోని రిటైర్మెంట్‌ తీసుకో

28 Oct, 2018 16:02 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు

పుణె : టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన కెరీర్‌కు వీడ్కోలు పలకాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.  ఈ సమయంలోనే ధోని రిటైర్మెంట్‌ ప్రకటించడం గౌరవప్రదంగా ఉంటుందని సూచిస్తున్నారు. శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మినహా మిగతా బ్యాట్స్‌మన్‌ దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత్‌ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో కీపింగ్‌లో అదరగొట్టిన ధోని.. ఓ అద్బుత క్యాచ్‌తో తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. అయితే ఇదే విధంగా బ్యాటింగ్‌లోనూ రాణిస్తాడనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. దీంతో వారు ఇక ధోని రిటైర్మెంట్‌ తీసుకోవడమే ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చారు. ఈ మ్యాచ్‌కు ముందే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ధోనిని టీ20ల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎమ్మెస్కేపై భగ్గుమన్న అభిమానులు.. బ్యాటింగ్‌లో ధోని తాజా ప్రదర్శన చూసి డీలా పడ్డారు. (ఎమ్మెస్కేపై ధోని ఫ్యాన్స్‌ ఫైర్‌!)

ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఒంటరిపోరాటం చేసిన కోహ్లికి ఏ ఒక్కరు అండగా నిలవలేదు. ఇది అభిమానులు తీవ్ర ఆగ్రహానికి తెప్పించింది. దీంతో సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేసారు. ‘ప్రపంచకప్‌ ముందే భారత మిడిలార్డర్‌ గందరగోళంగా ఉంది. ప్రతీసారి కోహ్లి ఒక్కడే ఆడలేడు. ధోని తప్పుకొని అతని స్థానంలో ఓ మంచి బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలి’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. త్వరగా ధోని రిటైర్మెంట్‌ తీసుకోవాలి లేకుంటే అన్ని ఓడిపోవాల్సి వస్తుందని మరొకరు కామెంట్‌ చేశారు. ‘ధోని ఇప్పుడు వీడ్కోలు పలకడం గౌరవంగా ఉంటుంది. అతని కెరీర్‌లో ప్రతి ఒక్కటి సాధించాడు. అన్ని ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కానీ ప్రస్తుత పరిస్థితులు నిరాశ పరుస్తున్నాయని’ ఇంకొకరు పేర్కొన్నారు. (చదవండి: వారెవ్వా ధోని..)

మరిన్ని వార్తలు