కోహ్లి.. దేశం మొత్తం గర్విస్తోంది!

7 Jan, 2019 14:59 IST|Sakshi

చరిత్రాత్మక విజయంపై ప్రశంసల జల్లు

సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన కోహ్లిసేనపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆసీస్‌ గడ్డపై సిరీస్‌ గెలవాలన్న భారత్‌ దశాబ్దాల కల నెరవేరడంతో మాజీ క్రికెటర్లు.. సినీ తారాలు, రాజకీయ నాయకులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా భారత ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, దేశ ప్రధాని నరేంద్ర మోదీలు కోహ్లిసేనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, టాలీవుడ్‌ హీరో మహేష్‌ బాబులు ట్విటర్‌ వేదికగా కోహ్లిసేనను కొనియాడారు. 

‘ఆస్ట్రేలియా తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన కోహ్లిసేనకు అభినందనలు. అద్బుత బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శనతో రాణించిన ఈ ఆల్‌రౌండ్‌ ప్రతిభ మమ్మల్ని గర్వపడేలా చేసింది. దీన్ని ఇలానే అలవరుచుకోండి’ - రామ్‌నాథ్‌ కోవింద్‌

‘ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన భారత జట్టుకు అభినందనలు. అద్భుత టీమ్‌వర్క్‌తో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లకు ఈ సిరీస్‌ వేదికగా నిలిచింది. ఈ విజయ యాత్రను భవిష్యత్తులోను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా’- నరేంద్ర మోదీ 

‘ఆసీస్‌ గడ్డపై తొలిసారి సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత్‌ జట్టుకు శుభాభినందనలు. ఈ విజయంతో మేం గర్వపడుతున్నాం’- వైఎస్‌ జగన్‌

‘అద్భుత విజయం సాధించిన భారత్‌ జట్టుకు అభినందనలు. ఈ గెలుపుతో దేశం మొత్తం గర్విస్తోంది’- మహేశ్‌ బాబు

‘చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించిన భారత జట్టుకు అభినందనలు. ఈ సిరీస్‌ గెలుపుతో భారత్‌లోని ప్రతి క్రికెట్‌ అభిమాని గర్వపడుతున్నాడు. టీమిండియా సమష్టి కృషితోనే ఇది సాధ్యమైంది’. -వీరేంద్ర సెహ్వాగ్‌

 ‘తొలిసారిగా ఆసీస్‌లో సిరీస్‌ గెలిచిన టీమిండియాకు అభినందనలు. మీ ప్రదర్శన ఆకట్టుకుంది’ -మిచెల్‌ జాన్సన్‌, ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

‘ఈ చారిత్రక విజయం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసింది.’ -మహమ్మద్‌ కైఫ్‌, మాజీ క్రికెటర్‌

‘కెప్టెన్‌ కోహ్లీకి అభినందనలు. టీమిండియా బాగా ఆడింది’ - అమిత్‌ మిశ్రా ‌

‘ఇండియన్‌ క్రికెట్‌ టీం జిందాబాద్‌’ -అనుపమ్‌ ఖేర్‌, బాలీవుడ్‌ నటుడు

మరిన్ని వార్తలు