ఐసీసీ అత్యుత్తమ వరల్డ్‌కప్‌ జట్టు ఇదే..

9 Mar, 2020 15:20 IST|Sakshi

టీమిండియా నుంచి ఇద్దరు..

దుబాయ్‌:  మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీని ఆసీస్‌ కైవసం చేసుకోగా, భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌ మరోసారి కప్‌ను కైవసం చేసుకుని ఐదోసారి విజేతగా నిలిచింది.  దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)తమ అత్యుత్తమ వరల్డ్‌కప్‌ టోర్నమెంట్‌ జట్టును ప్రకటించింది. ఈ మెగా టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన 12 మంది వుమెన్‌ క్రికెటర్లను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన ఐసీసీ.. భారత్‌ నుంచి ఇద్దరికి మాత్రమే చోటు కల్పించింది.(మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ)

ఇందులో స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ కు ఐసీసీ ఎలెవన్‌ జాబితాలో చోటు దక్కగా, 12వ క్రీడాకారిణిగా షెఫాలీ వర్మను ఎంపిక చేసుకుంది. ప్రధానంగా వరల్డ్‌కప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టు నుంచి ఐదుగురు క్రికెటర్లకు తమ జట్టులో చోటిచ్చిన ఐసీసీ.. ఇంగ్లండ్‌ నుంచి నలుగుర్నీ తీసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక క్రీడాకారిణికి మాత్రమే అవకాశం కల్పించింది. 

ఐసీసీ వరల్డ్‌కప్‌ టీమ్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ ఇదే..
మెగ్‌ లానింగ్‌(కెప్టెన్‌)(ఆస్ట్రేలియా), అలెసా హీలీ(వికెట్‌ కీపర్‌)(ఆస్ట్రేలియా), బెత్‌ మూనీ(ఆస్ట్రేలియా), నాట్‌ స్కీవర్‌(ఇంగ్లండ్‌), హీథర్‌ నైట్‌(ఇంగ్లండ్‌), లౌరా వాల్వార్డ్‌(దక్షిణాఫ్రికా), జెస్‌ జొనాసేన్‌(ఆస్ట్రేలియా), సోఫీ ఎక్సలీస్టోన్‌(ఇంగ్లండ్‌),   అన్యా ష్రబ్‌సోల్‌(ఇంగ్లండ్‌), మెగాన్‌ స్కట్‌(ఆస్ట్రేలియా), పూనమ్‌ యాదవ్‌(భారత్‌), షెఫాలీ వర‍్మ(భారత్‌, 12వ మహిళ)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా