రిటైర్మెంట్‌‌ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ దిగ్గజం

4 Jul, 2020 13:00 IST|Sakshi

బీజింగ్‌ : చైనా బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ 36 ఏళ్ల లిన్ డాన్ ఆటకు రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు శనివారం ప్రకటించాడు. వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఆటగాడిగా లిన్‌ చరిత్ర సృష్టించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించాడు.

'కెరీర్‌లో కష్టతరమైన సమయంలో ఉన్నప్పుడు నా కుటుంబం జహా కోచ్‌లు, జట్టు సభ్యులు, అభిమానులు అండగా నిలిచారు. ఇప్పుడు నా వయస్సు 37 ఏళ్లు కావడంతో ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం కష్టమవుతుంది. జట్టు తరపున ఇతర ఆటగాళ్లతో కలిసి ఆడలేను.. అందుకే రిటైర్మెంట్‌కు సమయం వచ్చేసిందని భావించే ఈ నిర్ణయం తీసుకున్నా. టోక్యో ఒలింపిక్స్‌లో దేశం తరపున ఆడాలని మొదట్లో భావించా.. కానీ ప్రపంచంలో కరోనా వల్ల క్రీడలను వాయిదా వేయడంతో నా కల చెదిరిపోయింది. ఇన్ని రోజులు నన్ను అభిమానించిన వాళ్లకు పేరు పేరున కృతజ్ఞతలు' అంటూ ట్విటర్‌లో లిన్‌ డాన్‌ చెప్పుకొచ్చాడు. (యూనిస్‌ జోక్‌ చేస్తే.. సీరియస్‌ వ్యాఖ్యలా?)

డబుల్ ఒలింపిక్ స్వర్ణాలతో పాటు లిన్ ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. చాలా కాలం ప్రపంచ నంబర్ వన్ బ్యాడ్మింటన్ స్టార్ గా నిలిచిన లిన్‌ డాన్‌కు సూపర్ డాన్ గా పేరుంది. తన ప్రత్యర్థి అయిన మలేషియా స్టార్, స్నేహితుడు లీ చోంగ్ వీ రిటైర్ అయిన ఏడాది తర్వాత లిన్ తాను రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. లీ చోంగ్ వీ, లిన్ డాన్ లు  దశాబ్దానికి పైగా బాడ్మింటన్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక వెలుగు వెలిగారు. కాగా లిన్ డాన్ 666 సింగిల్స్ లలో విజయాలు సాధించాడు.(2011 ఫిక్సింగ్‌ : దర్యాప్తు నిలిపివేసిన శ్రీలంక)

మరిన్ని వార్తలు