దాయాదుల పోరు.. టాస్‌ గెలిచిన పాక్‌

4 Feb, 2020 13:31 IST|Sakshi

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) : అండర్‌-19 వరల్డ్‌ కప్‌లో భారత్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగనున్నాయి. దాయాదుల మధ్య పోరు కావడం, గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఇరు జట్లు కూడా లీగ్‌ దశలో అద్భుతమైన ఆట తీరు కనబరచడంతో ఈ మ్యాచ్‌పై మరింత ఆసక్తి నెలకొంది. అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ ఆడిన 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. క్వార్టర్స్‌ ఫైనల్‌ల్లో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన భారత్‌ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు పాకిస్తాన్‌ ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లో విజయం సాధించగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఫలితం తేలలేదు. టోర్నీలో భారత్‌ అత్యధిక స్కోరు 297 కాగా పాక్‌ 294 పరుగులు చేసింది. బౌలింగ్‌లో భారత్‌ మొత్తం 40 వికెట్లు పడగొట్టగా, పాక్‌ 39 వికెట్లు తీసింది.

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య మొత్తం 9 మ్యాచ్‌లు జరగగా.. భారత్‌ 4 గెలిచి, 5 ఓడింది. అయితే గత మూడు సమరాల్లో భారత్‌దే పైచేయి. 1988, 2002, 2004, 2006, 2010 లలో పాకిస్తాన్‌ గెలిస్తే.. 1998, 2012,2014, 2018లలో భారత్‌ విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు